త్వరలో ఇండ్లులేని వారికోసం కొత్త పథకం…

28
prashanth reddy

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో ఇండ్లు లేని వారి కోసం కొత్త పథకం తీసుకురాబోతున్నామని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇండ్లస్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి రూ. 5 లక్షలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.

అసెంబ్లీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి.. తెలంగాణ సమగ్ర సర్వేలో ఇండ్లు లేని వాళ్ళు దాదాపుగా 26,31,739 ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,91,000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశామన్నారు.

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కొందరు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. ప్రధాని మోడీని రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్ల నిర్మాణం కోసం 10,442 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.