ఏం చెప్తిరి..ఏం చెప్తిరి..కల్కి కమర్షియల్ ట్రైలర్

218
kalki trailer

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తైన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

మహేష్ మహర్షి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఏం చెప్తిరి ఏం చెప్తిరి అంటూ ఎప్పుడు ఇలాగే చెబుతారా అంటూ రాజశేఖర్ ఒక్క డైలాగ్ తప్ప ట్రైలర్‌లో యాక్షన్‌ పార్టును ఎక్కువ భాగంలో చూపించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ “ఇప్పటికే విడుదలైన రాజశేఖర్ ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ కు అద్భుత స్పందన లభించింది. నా నుంచి రాబోతున్న ఈ సినిమా కమర్షియల్ గా ఉంటూ కొత్తగా ఉంటుంది. ‘కల్కి’ ఎంత కొత్తగా ఉండబోతుంది అనేది టీజర్ లో చూపించే ప్రయత్నం చేశాం. ఎంత కొత్తగా ఉంటుందనేది కమర్షియల్ ట్రైలర్ లో చూపించాం. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య, అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మహేష్ బాబు గారి ‘మహర్షి’తో మా సినిమా కమర్షియల్ ట్రైలర్ విడుదల అవుతుండడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులందరూ ట్రైలర్ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నా. ఇది కమర్షియల్ ట్రైలర్ మాత్రమే. సినిమా విడుదలకు ముందు ‘కల్కి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం” అన్నారు.

KALKI Commercial Trailer With Honest English Subtitles | Dr. Rajashekar | A Prasanth Varma Film