Prabhas:ప్రభాస్ వెనక్కి తగ్గాల్సిందేనా?

16
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ కల్కి 2898 ఏ డి ‘. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ అశ్వినీదత్. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సైంటిఫిక్ జోనర్ లో వస్తున్న ఈ మూవీలో గ్రాఫిక్స్ మెయిన్ హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్తృమ్ పాస్ట్, ఎక్స్తృమ్ ఫ్యూచర్ ను ఈ మూవీ చూపించబోతున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ మూవీలో నాగ్ అశ్విన్ అసలు ఏం చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. మరి మూవీలో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

ఇక ఈ కల్కి మూవీని మే 9న విడుదల చేయబోతున్నట్లు గతంలో చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థిఃతులు చూస్తుంటే కల్కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 13న సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఎలక్షన్ టైమ్ లో మూవీని రిలీజ్ చేస్తే కలెక్షన్ల పై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే చిత్ర యూనిట్ పోస్ట్ పోన్ వైపు అడుగులు వేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సమ్మర్ నుంచి తప్పించి దసరా బరిలో మూవీని నిలిపే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇది ప్రభాస్ అభిమానులను నిరుత్సాహ పరిచే విషయమే. అయితే మూవీ వాయిదా పై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో చెప్పిన టైమ్ కి కల్కి రిలీజ్ అవుతుందా ? లేదా వాయిదా పడుతుందా అనేది అందరిలోనూ బిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిగిలింది. మరి కల్కి విషయంలో ఏ జరగబోతుందో చూడాలి.

Also Read:మోడీ – జగన్.. మధ్య వైరం?

- Advertisement -