Prabhas:’కల్కి’ వచ్చేది అప్పుడే?

10
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏ.డి “. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. పురాణాల ఆధారంగా చరిత్రను చూపిస్తూ అలాగే ఫ్యూచర్ లో ప్రపంచం ఎలా ఉండబోతుందనే దానిపై సైంటిఫిక్ డ్రామా గా మూవీని రూపొందిస్తున్నారు నాగ్ అశ్విన్. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇంతవరకు ఎవరు చూపించని రీతిలో విజువల్ ట్రీట్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. గత మూడేళ్లుగా సెట్స్ పై ఉన్న ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. మొదట ఈ మూవీని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారు మేకర్స్. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో సమ్మర్ కనుకగా మే 9 కి పోస్ట్ ఫోన్ చేశారు.

ఇక సమ్మర్ లో ప్రభాస్ రావడం పక్కా అని అభిమానులు సంబరపడుతున్న వేళ అనూహ్యంగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కావడంతో మూవీ విడుదల పై మళ్ళీ సస్పెన్స్ నెలకొంది. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో మే 9న మూవీని విడుదల చేస్తే కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందని భావించి మూవీని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమ్మర్ నుంచి ఈ మూవీని ఆగస్టు కు పోస్ట్ పోన్ చేస్తారని మొదట వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికే ఎన్నోమార్లు ఈ మూవీ వాయిదా పడడంతో ఇతర ఇండస్ట్రీలలోని బయ్యర్స్ ఈ మూవీని ఎట్టి పరిస్థితిలో మే లోనే విడుదల చేయాలని పట్టుబడుతునట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో చేసేదేమీలేక కుదిరితే మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి సాలార్ పార్ట్ 1 తో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన ప్రభాస్ ‘కల్కి 2898 ఏ.డి’ ఇంకెలాంటి వసూళ్ల సునామీ సృష్టిస్తాడో చూడాలి.

Also Read:ఆది సాయికుమార్..ష‌ణ్ముఖ

- Advertisement -