యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నిన్న రాత్రి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చాడు ఎన్టీఆర్. మొదటి రోజు ఎన్టీఆర్ – ప్రకాష్ రాజ్ లపై కొన్ని ప్రత్యేకమైన మాంటేజ్ షాట్స్ ను తీశారు. ఈ షాట్స్ ఓ సాంగ్ లో భాగం అని తెలుస్తోంది. ఈ షూటింగ్ విషయాన్ని ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అధికారికంగా తెలియజేశారు. పైగా సెట్ లో తాను మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తో కలిసి దిగిన ఫొటోల్ని రత్నవేలు షేర్ చేశారు. రత్నవేలు షేర్ చేసిన ఈ షూటింగ్ పిక్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఓ భారీ బోటు సెట్ కనిపిస్తోంది.
అన్నట్టు హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కెన్నీ బేట్స్ ఈ టీమ్ తో జాయిన్ కానున్నాడు. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే ఈ సినిమా షూట్ లో జాయిన్ కానుంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది ఈ మూవీ. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. మరి ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు వచ్చిన క్రమంలో ఎన్టీఆర్ సినిమాలపై మరింత అంచనాలు పెరిగాయి.
అందుకే ఈ సినిమాని అంతర్జాతీయ మూవీగా కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఈ క్రమంలోనే, నటీనటుల విషయంలో కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అలాగే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ హిందీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యాడు. కాబట్టి.. ఈ సినిమాలో అందర్నీ నేషనల్ రేంజ్ ఆర్టిస్ట్ లనే తీసుకోబోతున్నారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్టు సెట్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని.. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ భారీ కసరత్తులు చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..