- Advertisement -
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు కలకలం రేపింది. ఈ మేరకు గంభీర్‌కు రెండు మెయిల్స్ రాగా ఈ మెయిల్స్‌లో చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు వచ్చిన మెయిల్స్ ఆధారంగా గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. గంభీర్‌కు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2021లో గంభీర్ బీజేపీ ఎంపీగా ఉన్న సమయంలో గంభీర్ కు ఇలాంటి ఈ-మెయిల్ బెదిరింపు వచ్చింది. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తనకు బెదిరింపులు రావడం పట్ల గంభీర్ సీరియస్ గా తీసుకున్నారు.
మార్చిలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తరువాత అతను జట్టుకు అందుబాటులో లేరు.
Also Read:ఉగ్రదాడి..తెలంగాణ ప్రజలను కాపాడండి
- Advertisement -

