కోలీవుడ్ దర్శకుడు శంకర్.. రామ్ చరణ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దిల్ రాజు బ్యానర్‌లో ఈ సినిమా 50వది కాగా కియారా అద్వాని, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. సంక్రాంతి రేసులో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈచిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ కథ రచయిత కార్తీక్ సుబ్బరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను శంకర్‌కి తొలుత చెప్పిన కథ ఒకటి కానీ తర్వాత అది పూర్తిగా మారిపోయిందన్నారు. చాలా మంది రచయితలు ఇన్వాల్వ్ కావడంతో కథ, స్క్రీన్ ప్లే పూర్తిగా మారి భిన్నమైన రిజల్ట్ వచ్చిందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సూర్య హీరోగా తెరకెక్కుతున్న రెట్రోకు దర్శకత్వం వహిస్తున్నారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రెట్రో 2025 మే 1న థియేటర్లలో విడుదలకానుంది.
Also Read:హిమాచల్, తిరుమలలో హై అలర్ట్

