బెట్టింగ్ యాప్స్ కేసులు సీఐడీకి!

14
- Advertisement -

బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సైబరాబాద్ , హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కేసులన్నీ ఇక సీఐడీ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. మియాపూర్‌కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై మియాపూర్, పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్ నెం.393/2025 కింద 318 (4) 112, రెడ్ విత్ 49 బీఎన్ ఎస్ 3, 3(ఏ) 4, టీఎస్ జీఏ,66-డి ఐటీఏ 2000-2008 సెక్షన్లతో కేసులు బుక్ చేశారు. నోటీసులు అందుకున్న వాళ్లలో దగ్గుబాటి రాణా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాత్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్, వాసంతి కృష్ణన్, శోభశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహ పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషాయనీ సుప్రీత ఉన్నారు.

సీఐడీ చీఫ్‌ పర్యవేక్షణలో సిట్‌ పని చేసేలా డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ ఎం.రమేశ్‌ నేతృత్వంలోని సిట్‌ బృందంలో ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సింధు‌ శర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్‌, సీఐడీ డీఎస్పీ శంకర్‌ సభ్యులుగా ఉన్నారు.

Also Read:కోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగం

- Advertisement -