ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ హీరో..!

41
salar

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ సలార్. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌కు బ్రేక్ పడగా సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. ప్రభాస్ ను ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

కాగా,ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తోంది. తండ్రీకొడుకులుగా ప్రభాస్ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ రెండు విభిన్నమైన లుక్స్ లో ప్రభాస్‌ను చూడటానికి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.