జూన్ 1 నుండి పిల్లలపై కోవాగ్జిన్ ట్రయల్..!

43
covaxin

దేశంలో థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌కు డీజీసీఏ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2-18 ఏండ్ల వయస్కుల వారిపై కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని భారత్ బయోటెక్ భావిస్తోంది.

దేశవ్యాప్తంగా 525 మంది చిన్నారులపై ప్రయోగాలు జరపకుండగా ప్రయోగాలు త్వరగా పూర్తయ్యి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా వేసేందుకు అనుమతులు వస్తాయని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా ఆశాభావం వ్యక్తంచేశారు.