బ్లాక్‌, వైట్‌.. కొత్తగా ఎల్లో ఫంగస్..

111
Yellow fungus
- Advertisement -

దేశంలో ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి తోడు రకరకాల ఫంగ‌స్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లువురు కరోనా రోగులు బ్లాక్‌, వైట్‌ ఫంగస్ బారీన ప‌డ్డారు. ఇప్పుడు కొత్తగా ఎల్లో ఫంగస్ పుట్టుకొచ్చింది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో ఒక వ్య‌క్తికి ఎల్లో ఫంగ‌స్ సోకిన‌ట్లు వైద్యాధికారులు నిర్ధారించారు.

ఎల్లో ఫంగస్ బారిన పడిన వ్యక్తి ప్రస్తుతం ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ బ్రిజ్ పాల్ త్యాగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కంటే ఎల్లో ఫంగస్ ప్రమాదకరమైనదని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎల్లో ఫంగస్ కు యాంఫోటెరిసిస్-బీ ఇంజెక్షన్‌తో చికిత్స అందించవచ్చని డాక్టర్లు చెప్పారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని హెచ్చరించారు.

ఎల్లో వైరస్ లక్షణాలు: బరువు తగ్గడం, నీరసం, ఆకలి మందగించడం లేక పూర్తిగా ఆకలి కాకపోవడం. చీము కారే లక్షణం కూడా ఉంటుందని వైద్యులు చెప్పుతున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పరశుభ్రత లేని వారు ఈ ఫంగస్ కు గుయ్యే అవకాశం ఉంది.

- Advertisement -