తనను ఎవరు సంప్రదించలేదు: కుమారస్వామి

36
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తుందన్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించారు మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి.

త‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ కాంటాక్ట్ కాలేద‌ని, త‌న‌కు డిమాండ్ లేద‌ని, త‌న‌దో చిన్న పార్టీ అన్నారు. రాబోయే 2-3 గంట‌ల్లో క్లారిటీ వ‌స్తుంద‌ని, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రెండు పెద్ద పార్టీలే భారీగా స్కోర్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రంలో మంచి అభివృద్ధి సాగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు కుమారస్వామి తెలిపారు.

Also Read:సూర్య అదుర్స్..ముంబై ఘనవిజయం

మొత్తం 224 స్ధానాలుండగా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా బీజేపీ 70 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది.

- Advertisement -