JDS:బీజేపీ మాయాలో జేడీఎస్‌?

19
- Advertisement -

కర్నాటకలో ఎవరు ఊహించని విధంగా బీజేపీ మరియు జెడిఎస్ పార్టీల మద్య పొత్తు కుదిరింది. ఈ ఉప్పు నిప్పులా ఉండే ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. అందులో భాగంగానే జెడిఎస్ పార్టీకి నాలుగు సీట్లు కేటాయించి పొత్తుకి సిగ్నల్ ఇవ్వడంతో.. జెడిఎస్ కూడా బీజేపీ ఆఫర్ కు ఒకే చెప్పింది. దీంతో మరోసారి కర్నాటక రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, జెడిఎస్, బీజేపీ ఎలాంటి పొత్తు లేకుండా ఎవరికి వారే అన్నట్లుగా బరిలోకి దిగాయి. అప్పుడు అటు కాంగ్రెస్ తో గాని ఇటు బీజేపీ తో గాని కలిసే ప్రసక్తి లేదని జెడిఎస్ అధిస్థానం తేల్చి చెబుతూ వచ్చింది. .

ముఖ్యంగా బీజేపీ తో అసలు కలవబోమని తెగేసి చెప్పింది. తీర మూడు నెలలు గడవక ముందే బీజేపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జెడిఎస్ పార్టీ. మరి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి ఏమైనా వ్యూహరచన ఉందా అంటే అవుననే చెబుతున్నారు విశ్లేషకులు ప్రస్తుతం కర్నాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటలని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ జోరుకు బ్రేకులు వేయాలంటే పొత్తు ఒక్కటే మార్గమని భావించిన బీజేపీ.. జెడిఎస్ తో చేతులు కలిపినట్లు తెలుస్తోంది.

దానికి తోడు కర్నాటకలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా వాటిని క్లీన్ స్వీప్ చేయాలంటే జెడిఎస్ మద్దతు తప్పనిసరి అనేది కమలనాథుల అభిప్రాయం. అందుకే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో జెడిఎస్ కు నాలుగు సీట్లు కేటాయించి మిగిలిన స్థానాల్లో బీజేపీ బరిలో దిగాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో 25 స్థానాలకు గాను 23 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. ఈసారి ఆ మూడు స్థానాలతో పాటు టోటల్ 25 ఎంపీ సీట్ల పై కమలం పార్టీ గురి పెట్టింది. అయితే ప్రస్తుతం హస్తం పార్టీ జోరుమీద ఉండడంతో బీజేపీ క్లీన్ స్వీప్ సాధ్యమేనా అనేది ప్రశ్నార్థకమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:పిక్ టాక్ : ఉఫ్.. సొగసుల విధ్వంసం

- Advertisement -