ఇలా చేస్తే హార్ట్ ఎటాక్‌కు చెక్‌..

116
- Advertisement -

నేటిరోజుల్లో హార్ట్ ఎటాక్ సమస్య ఎక్కువ మందిని భయపెడుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఏ వయసు వారైనా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద గుండె సంబంధిత సమస్యలతో భాదపడుతున్న వారే ఎక్కువగా ఉన్నట్లు ఆయా సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచం ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి ఏడాది దాదాపు 17.9 మిలియన్ మరణాలు హార్ట్ ఎటాక్ తోనే నమోదు అవుతున్నాయట. దీన్ని బట్టి చూస్తే హార్ట్ ఎటాక్ సమస్య ఏ స్థాయిలో ప్రపంచాన్ని భయపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణం గుండెకు రక్తాన్ని తీసుకెల్లే రక్త నాళాల్లో చెడు కొవ్వు పెరుకుపోవడమే. ఇలా రక్త నాళాలలో చెడు కొవ్వు పెరుకుపోవడం వల్ల అవి గట్టిగా లేదా సన్నగా మారుతాయి. దాంతో గుండెకు తగినంతా రక్త సరఫరా జరగదు. ఫలితంగా ఆక్సిజన్ అందక తీవ్రమైన గుండె నొప్పి వస్తుంది..

దీనినే హార్ట్ ఎటాక్ లేదా కార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటారు. కొన్ని లక్షణాల హార్ట్ ఎటాక్ సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. గుండె దగ్గర మంటగా అనిపించడం, ఛాతీ వెనకాల, దవడ దగ్గర, గొంతులో అసౌకర్యంగా ఉండడం. తీవ్రంగా చమటలు పట్టడం, కడుపులో అసౌకర్యంగా అనిపించడం, ఊపిరి సరిగా తీసుకోలేక పోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం.. ఈ లక్షణాలు కనిపిస్తే హార్ట్ ఎటాక్ కు సూచనగా భావించవచ్చు. అయితే హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత భాదపడడం కన్నా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానాన్ని మానేయలి, జంక్ ఫుడ్ తినరాదు, రక్త పోటును అదుపులో ఉంచుకోవాలి. ఎక్కువ సేపు కూర్చోకూడదు.

ప్రతిరోజూ నడక లేదా వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. తగినంత నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి, ముఖ్యంగా గుండె ఆరోగ్య సంబంధిత ఆహారాన్ని తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో ఒమేగా 3 ఫాటి యాసిడ్స్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈజ ఒమేగా 3 చేపలలో పుష్కలంగా లభిస్తుంది. అలాగే సబ్జా గింజలలోనూ ఒమెగా 3 లభిస్తుంది. ఇక ఏ సీజన్ లోనైనా లభించే కూరగాయలు, ఆకు కూరలు తప్పకుండా తినాలి. వీటిలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పండ్లలో.. బెర్రి పండ్లు, కమలా పండ్లు, బత్తాయి, అరటి, దానిమ్మ, పుచ్చకాయ, రేగు పండ్లు, జామా వంటి ఫలాలు గుండె సంబంధిత వ్యాధులను దూరంచేసే పోషకలకు కల్గి ఉన్నాయి. అలాగే క్యారెట్, బీట్రూట్, నిమ్మకాయలు వంటివి తరచూ తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అందువల్ల మనం రోజు తినే ఆహారంలో వీటిని ఉండేలా చూసుకుంటే హార్ట్ ఎటాక్ మరియు ఇతరత్రా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 Also Read:పీవీకి భారతరత్న..తెలంగాణకు గర్వకారణం

- Advertisement -