దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు..కట్టకట్టలుగా కొత్త కరెన్సీ

271
IT,ED raids four places in Kolkata
- Advertisement -

దేశవ్యాప్తంగా ఐటీ,ఈడీ సోదాలను ముమ్మరం చేసింది. ఐటీ,ఈడీ దాడుల్లో భారీగా కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. నిన్న తమిళనాడు సీఎస్ ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇవాళ వేర్ హౌజింగ్ ఎండీ నాగరాజన్ ఇంటిపై దాడులు నిర్వహించారు. కోటి 25 లక్షల నగదు, 6 కిలోల బంగారం సీజ్‌ చేశారు.

ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రూ.31లక్షల పాత కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నదదులో రూ.500,1000 నోట్లు వున్నట్లుగా గుర్తించారు. దీంతో కోటక్ మహేంద్ర బ్యాంక్ లో రూ.39 కోట్ల దొంగనోట్లను గుర్తించారు. నవంబర్ 8వ తేదీ అనంతరం భారీగా నకిలీ నోట్లను డిపాజిట్ చేసినట్లుగా గుర్తింపు..సేలం సెంట్రల్ బ్యాంకులోనూ ఐటీ సోదాలు జరిపారు. రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ట్రక్ లో తరలిస్తున్న రూ. 35 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.

యూపీ సంబాల్‌లో 20 లక్షల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు భారీగా అక్రమ ధనాన్ని పోగు చేసుకుని సీబీఐ, ఈడీ కేసుల్లో చిక్కుకున్న టీటీడీ మాజీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, తమిళనాడు వ్యాపారి శేఖర్ రెడ్డి కేసులో మరో పెద్ద చేపను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. కోల్ కతా కేంద్రంగా నిర్మాణ రంగం సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న పారస్ మాల్ లోధా శేఖర్ రెడ్డికి పూర్తిగా సహకరించారని ఆరోపిస్తూ ఆయన్ను అరెస్ట్ చేశారు. శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్ కేసుల్లో విచారణలో భాగంగా పారస్ మాల్ పేరు బయటకు వచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆయన రూ. 25 కోట్ల నోట్ల మార్పిడికి పాల్పడ్డాడని, ఆ డబ్బు శేఖర్ రెడ్డిదేనని గుర్తించామని అధికార వర్గాలు వెల్లడించాయి.

న‌ల్ల‌కుబేరులు న‌గ‌దు త‌ర‌లింపుల‌కు విమానాల‌ను కూడా ఉప‌యోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో త‌నిఖీ సిబ్బందికి అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ రోజు ఉద‌యం చెన్నయ్‌ విమానాశ్రయంలో త‌నిఖీలు చేస్తోన్న సిబ్బంది భారీగా కొత్తనోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్య‌క్తుల నుంచి ఏకంగా రూ.1.34 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -