ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం

27
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. కస్టడీ ముగియడంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత..ఇది తప్పుడు కేసని, ఉద్దేశ పూర్వకంగా పెట్టిన కేసు అని మండిపడ్డారు.

ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని …ఇది రాజకీయ కేసు అని ఆక్షేపించారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని… కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు.

కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కస్టడీ పూర్తయిన రోజే బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని…కవిత పిల్లలు మైనర్లని, వారిని కలిసేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. కవితను మరో ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరగా ఇరువర్గాల వాదన విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.

Also Read:బోయపాటి – బాలయ్య..అప్‌డేట్!

- Advertisement -