‘ఇండియా’ సభ రెడీ..మమతా హాజరవుతారా?

12
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంలో మోడీని గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమై కూటమిగా ఎన్నికల బరిలో దిగుతుంటే.. బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ ప్రతిపక్ష నేతలను జైలుకు పరిమితం చేస్తోంది. అందులో భాగంగానే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తరువాత బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఆప్ ఎదుగుతున్న క్రమంలో ఆ పార్టీ కన్వీనర్ కేజ్రివాల్ అరెస్టు కావడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. ఆయన అరెస్టు కేవలం ఆప్ పార్టీకి మాత్రమే కాకుండా టోటల్ ఇండియా కూటమిదే స్ట్రాంగ్ ఎఫెక్ట్ గా మారింది.

ఎందుకంటే కేజ్రివాల్ కూటమిలో ఉన్న కారణంగా ఆయన అరెస్టు కావడంతో కూటమి యొక్క తదుపరి కార్యాచరణ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేజ్రివాల్ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఎన్నికల సమయానికి కూడా ఆయన బయటకు రాకపోతే ఇండియా కూటమి ఎలా అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారిన అంశం. ఇకపోతే కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి రేపు రామ్ లీలా మైధానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది.

ఈ సభకు 13 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తాన్ షాహీ హఠావో-లోక్ తంత్ర బచావో నినాదంతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ బహిరంగ సభకు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరవుతారా లేదా అనేది సందేహంగా మారింది. కూటమిలో భాగమైనప్పటికి ఆమె గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పై అలకబునారు. ఆ కారణంగానే ఇప్పటివరకు కూటమిలోని పార్టీలను కలుపుకొని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో కేజ్రివాల్ కు మద్దతుగా ఆమె కూటమికి హాజరైతే బహిరంగ సభ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. మరి ధీది హాజరవుతారా లేదా అనేది చూడాలి.

Also Read:భోజనానికి ముందు పెరుగు తింటే?

- Advertisement -