KCR:5 నెలల్లో రాష్ట్రం ఆగమాగం

7
- Advertisement -

దశాబ్దాల పాటు కలగని జగిత్యాల జిల్లాను చేసుకున్నాం… ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను తీసేస్తానంటుందని మండిపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ బస్సు యాత్ర 12వ రోజు జగిత్యాలకు చేరుకోగా ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. జగిత్యాల జిల్లా వుండాలంటే కొప్పుల ఈశ్వర్ ఎంపీ గా గెలువాలే అన్నారు. కొప్పుల ఈశ్వర్‌,బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వినోద్ కుమార్ గెలవాలన్నారు.ఇప్పుడున్న ప్రభుత్వానికి తోక తెల్వదు తొండెం తెల్వదు…పాలన సక్కగ చేయరాట్లే అన్నారు. ఇక్కడి వరదకాల్వను రిజర్వాయర్ చేసుకున్నాం..చెరువులునింపుకున్నాం రైతులు బతికినారు..మరి వరద కాల్వను ఎందుకు ఎండబెట్టినారు.?, ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని అంతా ఆగమాగం చేసిండ్రు అన్నారు.

బీడీ కార్మికులను పట్టించుకోలే, నేతన్నలను పట్టించుకోలే, గౌడన్నలను నిర్లక్ష్యం చేసిండ్రు అన్నారు. కేసీఆర్ స్కీములను ఆపుజేస్తున్నారు, 2500 రూపాయలు మహిళలకు బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నదని నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చెప్తున్నాడు, రొండు లక్షల రుణం మాఫీ అయిందా ?, తెలంగాణలో ఎక్కడడిగినా ఏదీ ఐతలేదని చెప్తున్నారు జనాలు అన్నారు.ఈ ముఖమంత్రి ఎక్కడికి పోతే అక్కడ ఒట్లు పెట్టుకుంటాండు, బాసర సరస్వతి మీద యాదగిరి నర్సన్న మీద ఒట్టు పెట్టుకుంటాండు వీళ్లను నమ్మొచ్చునా.?, ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అరచేతిల వైకుంఠం చూయిస్తుందన్నారు.

నరేంద్ర మోడీ అచ్చేదిన్ వచ్చినయి అంటుర్రు, అమృత్కాల్ బేటి పడవో 15 లక్షలు వచ్చినయని మోడీ చెప్తుండు వచ్చినయా?, డాలర్ ముందు రూపాయి విలువ దారుణంగా పడిపోయింది, దిగుమతులు పడిపోయినాయి, ఈ మోడీ ప్రభుత్వం వల్ల ఏ ఒక్క వర్గానికికూడా లాభం జరగలేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతు భరోసా ఇస్గాం అన్నారు పాత రైతు బంధుకే దిక్కులేదు, రైతు బంధు ఐదేకురాలకే ఇస్తానంటుండు మరి ఏడు ఏకురాలోడు ఏంపాపం చేసిండు ఆలోచించాలన్నారు.

వడ్లు కొంటున్నారా .?, 500 బోనస్ వచ్చిందా బొగస్సే అయిందా,నేను నాడు ఉద్యమంలో ప్రాణం పెట్టి క్యూనిమ్స్ కొట్లాడితే మీరు ఎక్కడికక్కడ దీక్షలు చేసిండ్రు త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, మిషన్ భగీరధ ఆగిపోయింది, కరెంటు కోతలు మోపైనయి,కేసీఆర్ కిట్టు బందు, cmrf బంధు, బిఆర్ఎస్ ఎంపీ లు గెలిపిస్తేనే మన హక్కులకోసం కొట్లాడుతారన్నారు.

Also Read:ల్యాండ్ టైటిల్ యాక్ట్..నిజానిజాలేంటీ?

- Advertisement -