రాహుల్‌కు షాకిచ్చిన దీదీ!

18
- Advertisement -

ఇండియా కుటమిలో ముసలం మొదలైంది. ఇండియా కూటమికి షాకిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తృణమూల్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదని, ఇతర పార్టీలతో కలిసి పోటీ చేయమని చెప్పారు. కూటమిలోని పార్టీలతో తమ ప్రతిపాదలన్నీ తిరస్కరణకు గురయ్యాయని, అందుకే ఒంటిరిగా బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు.

ఇక గురువారం బెంగాల్‌లో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో మమతా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగాల్ లో ఏడు జిల్లాల్లో ఐదు రోజులు మొత్తం 523 కిలో మీటర్లు రాహుల్ యాత్ర సాగనుంది.

ఇక రాహుల్ యాత్రపై కనీసం సమాచారంకూడా ఇవ్వలేదని మండిపడ్డారు మమతా. అయితే ఇండియా కూటమిలో కొనసాగుతామని చెప్పారు మమతా. వచ్చే లోక్ సభ ఎన్నికలకు 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీని కోరింది. కేవలం రెండు స్థానాలు మాత్రమే ఇస్తామని మమతా తేల్చిచెప్పారు. ఇదే తృణమూల్ – కాంగ్రెస్ బ్రేకప్‌కి కారణమని తెలుస్తోంది.

Also Read:జుట్టు రాలుతోందా.. ఈ సమస్యలే కారణం !

- Advertisement -