భోజనానికి ముందు పెరుగు తింటే?

76
- Advertisement -

సాధారణంగా పెరుగు తినే అలవాటు ప్రతిఒక్కరికి ఉంటుంది. ఎక్కువగా భోజనం తరువాత చివరగా పెరుగు తింటూ ఉంటారు చాలమంది పెరుగులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం వంటి వాటితో పాటు విటమిన్ బి6, బి12 వంటివి కూడా మెండుగా ఉంటాయి. పెరుగులో ఉండే కాల్షియం కారణంగా ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. ఇంకా పెరుగు తినడం వల్ల రక్తంలో పిహెచ్ శాతం సమతుల్యంగా ఉంటుంది. హైబీపీ, లో బీపీ వంటివి క్రమబద్దీకరించబడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పెరుగు తినడం వల్ల ఉపయోగాలు అనేకం. అయితే పెరుగు ఎప్పుడు తింటే మంచిది ? అనే దానిపై మాత్రం చాలమందికి క్లారిటీ లేకపోవడం.

ఎక్కువ మంది భోజనం చేసిన తరువాత పెరుగుతింటూ ఉంటారు ఇలా చేయడం మంచిదే ఎందుకంటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయ పడుతుంది. కానీ కొందరిలో భోజనానికి ముందు కూడా పెరుగు తినే అలవాటు ఉంటుంది. మరి ఇలా తినడం మంచిదేనా అంటే.. అసలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగు సాధారణంగానే చల్లగా ఉంటుంది. అందువల్ల ఖాళీ కడుపుతో భోజనానికి ముందు పెరుగు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది.

Also Read:Revanth:రేవంత్ ‘రౌడీ రాజకీయం’?

ఎందుకంటే పెరుగులో లాక్టోజ్ ఉంటుంది. ఇది ఆహారం కంటే ముందే కడుపులోకి చేరడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్ ల పనితీరు మందగిస్తుంది. తద్వారా మలబద్దకం వంటి సమస్యలు చుట్టూ ముడతాయి. ఇంకా కఫానికి కూడా దారి తీస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిల్లో భోజనానికి ముందు పెరుగు తినకూడదట. ఇక అతిగా పెరుగు తినడం కూడా అనర్థమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా బరువు పెరగడం, బద్దకం, ఆయాసం వంటి సమస్యలు దారి చేరతాయట. కాబట్టి వీలైనంత వరకు పెరుగును లిమిట్ లోనే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -