ఐపీఎల్ 2023 నేటి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. గౌహతి లోని బర్సాపుర స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు కూడా చెరో విజయంతో మంచి దూకుడు మీద ఉన్నాయి. హైదరబాద్ పై 74 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న రాజస్తాన్.. అలాగే కోల్ కతా పై 7 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్.. ఇరు జట్లు కూడా రెండవ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నాయి.
దాంతో నేటి మ్యాచ్ కోసం ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. మ్యాచ్ ను ఏ దశలోనైనా మలుపు తిప్పగలిగే సంజు సంసన్, సింరోన్ హెట్మెలర్, పడిక్కల్ , జో రూట్, బట్లర్ వంటి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మెన్స్ రాజస్తాన్ సొంతం ఇక బౌలింగ్ పరంగా కూడా చహల్, బోల్ట్, సైని, వంటి వాళ్ళతో రాయల్స్ పటిష్టంగా ఉంది. ఇక పంజాబ్ విషయానికొస్తే.. శికర్ ధావన్, రాయ్, రాజపక్షా వంటి వాళ్ళు ఉన్నప్పటికి గత మ్యాచ్ లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలర్ల విషయానికొస్తే.. హర్షదీప్ సింగ్, రబడ, ఎల్లిస్, చహార్ వంటి వాళ్ళతో బలంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ రెండు జట్లు మద్య 24 మ్యాచ్ లు జరుగగా అందులో 14 మ్యాచ్ లలో రాజస్తాన్, పంజాబ్ పై విజయం సాధించగా.. 10 సార్లు పంజాబ్ రాజస్తాన్ పై పైచేయి సాధించింది.
ప్రధానంగా రాజస్తాన్ జట్టులో బట్లర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. గత సీజన్ లో 17 మ్యాచ్ ల్లో 863 పరుగులు చేసి వీరవిహారం చేసిన బట్లర్.. ఈ సీజన్ లో కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇక ఇటీవల సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 22 బంతుల్లోనే 54 పరుగులు చేసి బౌలర్లను ఊచకోత కోశాడు. బౌలర్ ఎవరైనా.. జట్టు ఏదైనా బాదడమే పనిగా పెట్టుకున్న బట్లర్.. పంజాబ్ పై కూడా చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి బట్లర్ ను తొందరగా పెవిలియన్ చేర్చితేనే పంజాబ్ కు విజయావకాశాలు ఉంటాయి. మరి ఈ ఆసక్తికరమైన పోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..