20 తర్వాతే బీజేపీ అధ్యక్షుడి ప్రకటన!

11
- Advertisement -

ఎట్టకేలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడుతో పాటు పలు రాష్ట్రాలకు అధ్యక్షుల ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే రాష్ట్రాల వారిగా అభిప్రాయాలను సేకరించిన బీజేపీ అధిష్టానం జాతీయ అధ్యక్షుడి ప్రకటనను ఈ నెల 20 తర్వాత చేయనుంది.

దాని కంటే ముందే ఆరు రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌, నడ్డా పాల్గొన్నారు.

తెలంగాణ, ఏపీ సహా యూపీ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కర్నాటక, పుదుచ్చేరి అధ్యక్షులను ప్రకటించనుంది BJP. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ బీజేపీ చీఫ్ ఎవరవుతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Also Read:ఏపీ, తెలంగాణ… వెదర్ అప్‌డేట్

- Advertisement -