ఇకపై రైళ్లలో ఏటీఎం సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు ప్రయోత్మకంగా కొన్ని రైళ్లలో ఏటీఎంలను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. మరికొన్ని రైళ్లలో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం..
ముంబయి-మన్మాద్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌కి దేశంలో మొట్టమొదటి ట్రైన్ ఏటీఎంను లాంఛ్ చేశారు. ఈ ఏటీఎంను AC కోచ్‌లో ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా నిర్వహించిన ట్రయల్ విజయవంతంగా పూర్తయింది.
Also Read:యూరప్‌కు చంద్రబాబు..
ఈ ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణ, చెక్‌బుక్ ఆర్డర్ చేయడం, ఖాతా స్టేట్‌మెంట్ పొందవచ్చు. దీంతో ఇకపై ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రయాణికులు నగదు తీసుకునే సౌకర్యం పొందవచ్చు. ఇది ఖచ్చితంగా భారతీయ రైల్వేలో గేమ్ ఛేంజర్ కానుంది. అయితే కొద్దిసేపు నెట్‌వర్క్ సమస్యలు ఎదురైనా సిగ్నల్ రావడంతో మంచిగా పనిచేసిందని చెప్పారు. ఈ ఏటీఎంలో షట్టర్ వ్యవస్థ మరియు 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చినట్లయితే, ఈ సేవను మరిన్ని రైళ్లకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.

