IPL 2023:గుజరాత్ కొంప ముంచిందదే!

49
- Advertisement -

అభిమానులను ఎంతగానో ఉర్రూతలూగించిన ఐపీఎల్ సీజన్ 16 ఎట్టకేలకు ముగిసిపోయింది. ఎన్నో ట్విస్ట్ లు, మరెన్నో మలుపులు ప్రతి మ్యాచ్ లోనూ సంచలనాలను నమోదు చేసిన ఆటగాళ్లు.. ఇలా ఈ సీజన్ ఐపీఎల్ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. అయితే సీజన్ మొత్తంలో జరిగిన మ్యాచ్ లు ఒకేత్తైతే నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ మరో ఎత్తు. చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మద్య జరిగిన ఫైనల్ పోరు మ్యాచ్ ఉత్కంఠభరింతంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. ఇప్పటివరకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఇదే అత్యుత్తమ భారీ స్కోర్. .

గుజరాత్ బ్యాట్స్ మెన్స్ లలో సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. సుదర్శన్ కు తోడు సాహా కూడా హాఫ్ సెంచరీతో ( 39 బంతుల్లో 54 పరుగులు ) రాణించడంతో 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఆ తరువాత వరుణుడు మ్యాచ్ కు మళ్ళీ అడ్డంకిగా మారడంతో ఆలస్యమైన ఇన్నింగ్స్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లకు కుదించాల్సివచ్చింది. దాంతో చెన్నై టార్గెట్ 15 ఓవర్లలో 171 పరుగులకు మారింది. ఇక చెన్నై బ్యాట్స్ మెన్స్ లలో డేవిడ్ కాన్వే ( 25 బంతుల్లో 47 పరుగులు ), దూబే ( 21 బంతుల్లో 32 పరుగులు ) రహనే ( 13 బంతుల్లో 27 పరుగులు ) చెలరేగడంతో చెన్నై విజయానికి బాటలు పడ్డాయి. అయితే చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా రవీంద్ర జడేజా ఒక ఫోర్, సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఛాంపియన్ గా మరోసారి నిలిచింది.

Also Read:హ్యాపీ బర్త్ డే..పరేష్ రావల్

గుజరాత్ ను దెబ్బతీసిన వరుణుడు
214 పరుగుల భారీ స్కోర్ చేసిన గుజరాత్ కు వరుణుడి దెబ్బ తగ్గిగా తాకింది. ఎందుకంటే అంతా భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. దాంతో లక్ష్యం 171 పరుగులకు మారింది. దానికి తోడు పిచ్ పై తేమ కారణంగా బంతి బౌలింగ్ కు ఏమాత్రం సహకరించలేదు. పరుగుల వేటలో చెన్నై తడబడకుండా లక్ష్యాన్ని చేధించింది. మొత్తానికి వర్షం చెన్నై జట్టుకు మేలు చేయగా గుజరాత్ టైటాన్స్ ను కొంపముంచింది.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -