Hyderabad:భారీగా పడిపోయిన రియల్ ఎస్టేట్

10
- Advertisement -

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. ఇళ్ళ అమ్మకాలు, కొత్త ఇళ్ళ సరఫరాలో హైదరాబాద్ వెనుకంజలో నిలిచింది. గతేడాది 2024 జనవరి-మార్చి మధ్య 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది 26 శాతం తగ్గి 10,647 యూనిట్ల ఇళ్ల అమ్మకాలే జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ వెల్లడించింది.

హైదరాబాద్‌లో ఇళ్ళ అమ్మకాలు భారీగా పడిపోగా బెంగళూరులో 13 శాతం, చెన్నైలో 8 శాతం పెరిగాయి. కొత్త ఇళ్ళ సరఫరాలో సైతం హైదరాబాద్‌లో 33 శాతం తగ్గగా బెంగుళూరులో 83 శాతం పెరిగింది.

Also Read:దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు మాత్రమే నగరం అభివృద్ధి చెందుతుండటం కూడా రియల్ వ్యాపారంపై పడిందంటున్నారు. ఇదే సమయంలో బెంగళూరులో పదమూడు శాతం, చెన్నైలో ఎనిమిది శాతం అమ్మకాలు పెరిగడంతో హైదరాబాద్‌లో రియల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -