కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 2020 భారత్‌లో నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది బీసీసీఐ. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.
దీంతో ఐపీఎల్ 13 సీజన్‌ను నిర్వహించేందుకు పలు దేశాలు ముందుకువస్తున్నాయి. ఐపీఎల్‌కు ఆతిథ్యమివ్వడానికి తాము సిద్ధమని ప్రకటించింది శ్రీలకం క్రికెట్ బోర్డు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా నిర్బంధంలో ఉన్న స్థితిలో లీగ్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కానీ ఐసీసీ సభ్యదేశాల నుండి ప్రతిపాదనలు వస్తున్నాయని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఐసీసీ సభ్యదేశాల్లో శ్రీలంక మిత్రపక్షంగా ఉందని.. వారి ప్రతిపాదనను అర్థం చేసుకోగలం అన్నారు.
2009లో ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో, 2014లో తొలి అర్ధభాగాన్ని యూఏఈలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించేలా ప్లాన్ జరుగుతున్నట్లు సమాచారం.