నేనెప్పుడూ పవన్ ఫ్యాన్‌నే: హరీష్ శంకర్

303
pawan
- Advertisement -

నేనెప్పుడూ పవన్ కల్యాణ్ ఫ్యాన్‌నేనని స్పష్టం చేశారు దర్శకుడు హరీష్‌ శంకర్. ఇటీవలె వరుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్‌తో హిట్ కొట్టిన హరీష్‌..తాజాగా పవన్‌తో సినిమా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్పందించిన హరీష్… తానెప్పుడూ ఓ డైరెక్టర్‌ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్‌ని చూడనని, ఓ ఫ్యాన్‌గా మాత్రమే చూస్తానని చెప్పారు. తాను చేసే ప్రాజెక్టు.. పవన్ ఫ్యాన్స్‌ అభిమానులు కోరుకునే విధంగా ఉంటుందన్నారు.

ప్రస్తుతం తాను ఓ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నానని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు. నిర్మాతలు మహేష్ ఎస్ కొనేరు, బన్నీ వాస్‌ల సహకారంతో త్వరలో సినిమాలు నిర్మించడం ప్రారంభిస్తానని అన్నారు.

- Advertisement -