766కు చేరిన కరోనా కేసుల సంఖ్య.

88
Coronavirus Telangana

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 766కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 66 నమోదయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 562 ఉండగా 186 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 18 మంది మృతి చెందారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 76 సంస్థల్లో పరిశోధన జరుగుతుండగా భారత్ బయోటెక్‌లో ప్రయోగాలు ముమ్మరమయ్యాయి.

అమెరికా, చైనా లో మానవులపై జరుపుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌లో ప్రధానంగా హైడ్రాక్సి క్లోరోక్విన్‌, యాంటిబయటిక్‌ అజిత్రోమైసిన్‌, రెమ్‌డెసివిర్‌, లోపినవిర్‌, రిటోనవిర్‌ డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నారు. జంతువులపై జరిపిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని, మానవులపై క్లినికల్‌ ట్రయల్స్‌ సానుకూలంగా ఉన్నాయని అమెరికాకు చెందిన ఇనోవియా తెలిపింది.