ఐపీఎల్ సంబురం…ఫ్యాన్స్‌కు పండగే!

157
ipl 2020

ఐపీఎల్ 13వ సీజన్‌ నేటి నుండి ప్రారంభంకానుంది. కరోనా నేపథ్యంలో యుఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనుండగా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో తలపడనుంది చెన్నై. రాత్రి 7.30 గంటలకు అబుదాబిలో మ్యాచ్ ప్రారంభంకానుంది.

దాదాపు 15 నెలల తర్వాత ధోనీ రీ ఎంట్రీ ఇవ్వనుండగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి ముంబై ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ రానుండటంతో హిట్ మ్యాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

చెన్నై ప్రధాన బలం ధోనినే. అద్భుతమైన ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్ అనుభవం ఉన్న స్పిన్నర్లు ఈ జట్టుకు సొంతం. మొత్తంగా ఆరు నెలలుగా అసలు సిసలైన క్రికెట్ మజాను మిస్ అయిన ఫ్యాన్స్‌కి ఈ మ్యాచ్ చాలారోజుల తర్వాత కిక్ ఇవ్వనుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఈ రెండు జట్లు తలపడనుండటం ఇది 29వ సారి కావడం విశేషం.