చెలరేగిన ఢిల్లీ ఓపెనర్లు..

209
delhi
- Advertisement -

ఆదివారం ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం లభించింది. శిఖర్‌ ధావన్‌కు జోడీగా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినీస్‌ ఓపెనర్‌గా వచ్చాడు. ఢిల్లీ ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లపై ఎదురు దాడికి దిగుతున్నాడు స్టోయినిస్. రెండో ఓవర్‌లో అతడి క్యాచ్‌ను హోల్డర్ డ్రాప్ చేయడంతో లైఫ్ వచ్చింది. దాన్ని స్టోయినిస్ చక్కగా ఉపయోగించుకున్నాడు. సందీప్ శర్మ, జేషన్ హోల్డర్‌ బౌలర్లను రఫ్పాడిస్తూ.. ఫోర్ల మోత మోగించాడు.

అటు ధావన్ కూడా ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఏ మాత్రం తడబాటు లేకుండా బౌలర్లను ఆటాడుకుంటున్నాడు. పవర్ ప్లేలో ఓపెనర్లు ఇద్దరు అద్భుతగా రాణించి మంచి ఆరంభం ఇచ్చారు. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేశారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఇదే దూకుడు కొనసాగితే ఢిల్లీ భారీ స్కోర్ చేసే అవకాశముంది.

క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటిల్స్ ప్రణాళిక రూపొందించింది. జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. పృథ్వీ షా, సామ్స్‌ను పక్కనబెట్టి ప్రవీణ్ దుబే, హెట్‌మెయిర్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. అంతేకాదు ఓపెనింగ్‌లోనూ మార్పులు చేసింది. సాధారణంగా పృథ్వీ షా లేకుంటే రహానే, ధావన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారు. కానీ ఇవాళ ధవన్‌కు తోడుగా స్టోనియిస్ ఓపెనర్‌గా వచ్చాడు. ఈ స్ట్రాటజీ వర్కువుట్ అయినట్లే కనిపిస్తోంది.

- Advertisement -