మే 8 లోపు రీ వెరిఫికేషన్‌ పూర్తి:ఇంటర్ బోర్డు

163
inter board

ఇంటర్ పలితాల్లో నెలకొన్న గందరగోళంపై దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది బోర్డు. 99కి బదులు సున్నా రావడానికి కారకులైన ఇద్దరు అధ్యాపకులపై వేటు వేసింది. పేపర్ దిద్దిన లెక్చరర్‌ తొలగించడంతో పాటు పర్యవేక్షక అధికారిపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

మంచిర్యాల జిల్లా జిన్నారం మండల కరిమల జూనియర్‌ కళాశాలకు చెందిన నవ్య (హాల్‌టికెట్‌ 1933216764)కు తెలుగులో 99 మార్కులకు బదులుగా.. ఓఎంఆర్‌లో 00 మార్కులు దిద్దారు. ఈ చర్యలకు బాధ్యులను చేస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఆర్‌బీనగర్‌ నారాయణ జూనియర్‌ కళాశాలకు చెందిన తెలుగు లెక్చరర్‌ డి.ఉమాదేవిని కళాశాల విధుల నుంచి తొలగించింది. రూ.5 వేల జరిమానా కూడా విధించింది. పర్యవేక్షక అధికారిగా వ్యవహరించిన రంగారెడ్డి జిల్లా కొత్తూరు గిరిజన గురుకుల కళాశాల లెక్చరర్‌ ఎస్‌.విజయకుమార్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేసింది.

మరోవైపు మే 8 నాటికి రీ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని ఇంటర్‌బోర్డు హైకోర్టుకు తెలిపింది. రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌లో ఎంత మంది ఉత్తీర్ణులయ్యారో తెలపాలని హైకోర్టు ఇంటర్‌బోర్డును ఆదేశించింది. వెరిఫికేషన్‌లో ఎంత మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతారో పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామని హై కోర్టు వెల్లడించింది.