ఆసక్తి రేపుతున్న ఈ టీజర్‌ చూడండీ..

178
Arjun Kapoor

మన దేశంలో పాకిస్థానీ తీవ్రవాదం నేపథ్యంగా బాలీవుడ్‌లో వచ్చినన్ని సినిమాలు ఇంకే భాషలో రాలేదన్నది నిజం. ఇప్పుడు ఆ జోనర్‌కు చెందిన సినిమా హిందీలో తెరకెక్కుతోంది. టైటిల్‌.. ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్’. 2007-2013 మ‌ధ్య జ‌రిగిన 57బాంబ్ బ్లాస్ట్‌ల నేప‌థ్యంలో రైడ్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్‌ గుప్తా తెర‌కెక్కించారు. అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. బిన్ లాడెన్స్ స్పూర్తితో కరుడుగట్టిన ఓ ఉగ్రవాది చేసిన దారుణ ఘటనలను ఈ చిత్రం ద్వారా చూపించ‌నున్నారు.

టీజర్‌ చూస్తే.. ఇతనెవరో? ఎలా ఉంటాడో? ఎవ్వరికీ తెలీదు. కానీ అందరూ ‘ఇండియాస్‌ ఒసామా’ అని పిలుస్తుంటారు. ఈ నేరగాడిని పట్టుకోవడానికి ఒక్క బుల్లెట్‌ కూడా వాడకుండా మన దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏం చేశారు?అన్న నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఆ ఐదుగురు వ్యక్తుల్లో ఒకరిగా అర్జున్‌ కపూర్‌ నటించారు. సినిమాలో అర్జున్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ప్రభాత్‌ పాత్రను పోషించారు. ఇక టీజర్‌ చూస్తుంటే ఈ సినిమాలో థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకునే మెటీరియల్ అయితే చాలా కనిపిస్తోంది. మే 24న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

India's Most Wanted | Official Teaser | Arjun Kapoor | Raj Kumar Gupta | 24th May 2019