ఆ ముదురు ప్రేమ జంట బ్రేకప్ ?

37
- Advertisement -

మలైకా అరోరా – అర్జున్ కపూర్ గ‌త ఐదారేళ్ల నుంచి త‌మ ప్రేమ వ్య‌వ‌హారంతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇన్నాళ్ల పాటు ప్రేమ‌లో మునిగి తేలిన ఈ బోల్డ్ జంట ప్రస్తుతం వీడిపోయే ఆలోచనలో ఉందట. నిజానికి ఇది బాలీవుడ్ కి షాకింగ్ విషయమే. ఎందుకంటే మలైకా – అర్జున్ త‌మ ప్రేమ వ్య‌వ‌హారం గురించి దాచుకోవ‌డానికి మొద‌టి నుంచి వెనుకాడ‌లేదు. రిసార్ట్స్ లో స్టే చేసే స‌మ‌యాల్లో వేర్వేరుగా ఫొటోల‌ను పెట్టినా.. ఒక‌టే ప‌రిస‌రాల్లో తాము ఉన్న‌ట్టుగా క్లూస్ ఇచ్చి వీరు త‌మ ప్రేమ గురించి లీక్ చేశారు. ఆ త‌ర్వాత క్ర‌మంగా మలైకా అరోరా – అర్జున్ కపూర్ పబ్లిక్ గానే జంట‌గా తిర‌గ‌సాగారు.

మొత్తమ్మీద గత ఆరేళ్ల నుంచి వీరి ప్రేమ క‌థ ఇలా కొన‌సాగుతూ వ‌చ్చింది. మ‌రి ఈ వ‌య‌సులో ఇన్నాళ్ల పాటు ప్రేమ‌లో ఉన్నారంటే అదేమీ చిన్న సంగ‌తి కాదు. అయితే గ‌త కొన్ని రోజుల నుంచి మలైకా అరోరా – అర్జున్ కపూర్ బ్రేక‌ప్ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప్రేమ ప‌క్షులు విడిపోయాయ‌ని.. చెరో దారి చూసుకున్నార‌నేది టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. అయితే ఇందుకు అధికారిక ధ్రువీక‌ర‌ణ లేదు. అసలు మలైకా – అర్జున్ ఎందుకు విడిపోతున్నారు ? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్.

కేవలం పెళ్లి విష‌యంలోనే మలైకా – అర్జున్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. అర్జున్ కపూర్ కు పెళ్లి మీద గాలి మ‌ళ్లింద‌ని, వివాహం చేసుకుందామంటూ మలైకాతో ప్ర‌తిపాదించాడు అని, అయితే అందుకు మలైకా అరోరా నిరాక‌రించింది అని, దీంతోనే ఈ ఇద్దరు మ‌ధ్య దూరం పెరిగిన‌ట్టుగా ముంబై స‌మాచారం. ఈ మ‌ధ్య‌నే బాలీవుడ్ ప్రేమ జంటలు వరుసగా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే అర్జున్ కపూర్ కి కూడా పెళ్లిపై ఆస‌క్తి మొద‌ల‌యినట్టు ఉంది. కానీ పెళ్లి మలైకాకి కొత్త కాదు కదా, అందుకే ఆమెకు ఆసక్తి లేదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -