ప‌రిణితి చోప్రా ఈ పాటకు ప్రాణం పోసింది.. వీడియో

200
Parineeti Chopra

భాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌,పరిణితి చోప్రా జంటగా నటించిన చిత్రం కేస‌రి. ఈ సినిమాలో అక్ష‌య్ భార్య‌గా ప‌రిణితి చోప్రా న‌టించిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద భారీ వసుళ్లు రాబడుతుంది. అయితే ఈ మూవీ లోని ఓ పాట పాడి ఆక్టుకుంది ప్రరిణితి చోప్రా. తేరి మిట్టి సాంగ్‌ను ఫిమేల్ వ‌ర్ష‌న్‌లో ఆమె పాడారు. ఎంతో ఫిల్‌తో పాడిన ఈ పాట‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు చేసింది.

ఆ సాంగ్ వెనుక ఫిల్మ్ విజువ‌ల్స్ ప్లే చేశారు. త‌న‌కు చిన్న‌నాటి నుంచి పాట‌లు పాడ‌డం అంటే ఇష్ట‌మ‌ని ఆ వీడియోకు ఆమె పోస్టు కూడా పెట్టింది. ఈ సాంగ్‌కు సినిమాలో మేల్ వ‌ర్ష‌న్‌ను బీ ప్రాక్ పాడారు. ప్రస్తుతం పరిణితి పాడిన ఈ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Teri Mitti Female Version - Kesari | Arko feat. Parineeti Chopra | Akshay Kumar | Manoj Muntashir