ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సూపర్‌ స్టార్‌..!

185
Aamir Khan
- Advertisement -

భాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్ ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చారు. సోమవారం అమీర్ ఖాన్ త‌న 56వ బ‌ర్త్‌డే జ‌రుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. త‌న బ‌ర్త్ రోజు తాను ఇప్ప‌టి నుండి సామాజిక మాద్యమాల‌కు దూరంగ ఉంటాన‌ని చెప్పి షాక్ ఇచ్చాడు. సినిమాలకు సంబంధించిన ప్రకటనలను సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ (ఏకేపీ) అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.

సోమవారం అమీర్ ఖాన్ త‌న 56వ బ‌ర్త్‌డే జ‌రుపుకోగా, ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖ‌లు ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. వారంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన అమీర్.. ఇదే నా చివ‌రి సందేశం అంటూ ఓ పోస్ట్ పెట్టారు. హాయ్, అంద‌రికి న‌మ‌స్కారం. నాపై మీరు చూపించే ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు. మీ ప్రేమ‌తో నా హృద‌యం నిండిపోయింది. ఇదే నా చివ‌రి పోస్ట్. సోషల్ మీడియా నుంచి బయటికి వచ్చినా కూడా మీతో మాత్రం ఎప్పటిలాగే కలుస్తూ ఉంటాను. నా సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ని మీరు ఏకేపీ(ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్)‌ అఫీషియల్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి పొందొచ్చు అని అమీర్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -