ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు తుదిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే.భారత్‌లో డిసెంబర్ నాటికి కరోనా టీకా కోవిషీల్డ్ అందుబాటులోకి రావచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) సీఈఓ అదార్ పూనవల్లా తెలిపారు.
బ్రిటన్‌లో వచ్చే నెల నుంచి కరోనా టీకాను అందుబాటులోకి తీసుకురావాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ బృందం నిర్ణయించగా తొలుత వైద్యులు, వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. బ్రిటన్‌లో అంతా సవ్యంగా జరిగితే దేశంలో డిసెంబర్ నాటికి టీకాను అందుబాటులోకి తేవచ్చని చెప్పారు.
తొలుత 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కోవిషీల్డ్ రెండు డోసుల టీకా అని చెప్పారు. ఒక డోసు టీకా వేసిన 28 రోజుల తర్వాత మరో డోసు టీకా వేయాల్సి ఉంటుందని అన్నారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి.