- Advertisement -
వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రామ రామ అంటూ సాగే ఈ పాటని రిలీజ్ చేశారు.
ఇందులో రామ నామం స్మరిస్తూ చిరంజీవి వేసే స్టెప్పులు అలరిస్తున్నాయి. ఇక శంకర్ మహదేవవ్, లిప్సిక గాత్రం మరింత వన్నె తెచ్చింది. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. జులై 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. విశ్వంభర’లో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
https://youtu.be/7GKYw1B48o8
Also Read:ప్రవీణ్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందే:ఐజీ
- Advertisement -

