మాస్ జాతర.. సాంగ్ ప్రొమో

17
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

తాజాగా ఈ సినిమా సాంగ్ ప్రొమో తూమేరా లవర్‌ని రిలీజ్ చేశారు. ఈ నెల 14న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నందు సవిరిగాన సంభాషణలు సమకూర్చారు.

 

Also Read:HCU భూములు..చీకటి కోణం ఏమిటి?:హరీష్

- Advertisement -