త్వరలో భారత్‌కు మరో కరోనా టీకా..

259
Moderna
- Advertisement -

త్వరలో భారత్‌లో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరయ్యాయి. భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ తాజాగా మోడెర్నా కరోనా వ్యాక్సిన్‌కు పచ్చజెండా ఊపింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ దిగుమతుల కోసం ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు మంజూరు చేసింది.

ఇప్పటివరకు భారత్‌లో అనుమతి పొందిన కరోనా టీకాలలో మోడెర్నా నాలుగవది. ఇప్పటివరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతి లభించగా, తాజాగా మోడెర్నా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎంఆర్ఏన్ఏ టెక్నాలజీతో మోడెర్నా టీకాను అభివృద్ధి చేశారు. క్లినికల్‌ ప్రయోగాల్లో 90శాతానికి పైనే సమర్థతతో పని చేస్తున్నాట్లు సమాచారం.

- Advertisement -