రైళ్లలో 3లక్షల ఐసోలేషన్ బెడ్స్…!

290
indian railways
- Advertisement -

కోవిడ్‌-19 బాధితుల కోసం రైల్వే కోచ్‌లనుఏ పర్యవేక్షణ గది (క్వారంటైన్‌) లేదా ఐసొలేషన్‌ క్యాబిన్లుగా ఆధునీకరించింది రైల్వే శాఖ. దాదాపు 20 వేల రైల్వే కోచ్‌లలో దాదాపుగా 3 లక్షల ఐసోలేషన్ బెడ్స్‌ని సిద్ధం చేసేలా ఇండియన్ రైల్వే ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశంలోని ఐదు రైల్వే జోన్లలో ఐసోలేషన్ కోచ్‌లు సిద్ధం కాగా… దాదాపుగా 5వేల కోచ్‌ల్లో 80 వేల బెడ్స్ సిద్ధం చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. ఒక్కో కోచ్‌లో 16 ఐసోలేషన్ బెడ్స్ ఉన్నట్లు వెల్లడించింది.

రైల్వేబోర్డు ఆదేశాల ప్రకారం దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా సూచనలతో లాలాగూడ వర్క్‌షాపులో కోచ్‌నంబర్‌ ఎన్సీ జీఎస్‌సీఎన్‌ 00205కు చెందిన రెం డింటిని ప్రొటోటైప్‌ ఐసొలేషన్‌ క్యాబిన్లుగా మార్చారు. స్లీపర్‌క్లాస్‌లో తొమ్మి ది క్యాబిన్లుండగా అందులో రెండు క్యాబిన్లను తయారుచేశారు.

వెంటిలేషన్‌ షట్టర్లకు దోమలు రాకుండా మెష్‌ బిగించారు. రెండు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాటిల్‌ హోల్డర్లు పెట్టారు. టాయిలెట్లలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు.

- Advertisement -