కరోనా అప్ డేట్స్..

310
covid
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 56 వేలకు చేరగా 42,089 మంది మృతి చెందారు. 1,77,039 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య1,87,321కి చేరింది.

దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,619కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 49కి చేరగా 150 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక తెలంగాణలో మర్కజ్ నుండి వచ్చిన వారికి, వారి బంధువులకు కలిపి రాష్ట్రంలో కొత్తగా 15 మందికి ఈ రోజు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతానికి 77 మంది యాక్టీవ్ పాజిటివ్ కేసులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

- Advertisement -