టీ20 వరల్డ్ కప్…కోహ్లీ సేన ఇదే

154
t20

వచ్చే ఏడాది యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ మెగా టోర్నీకి విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ,రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. అయితే ఈసారి యువ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ జట్టులో స్థానం సంపాదించగా రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలతో పాటుగా అశ్విన్ ను కూడా ఎంపిక చేసింది బీసీసీఐ.

కోహ్లీ, రోహిత్ లతో పాటుగా కేఎల్ రాహుల్, సూర్య కుమార్ లు బ్యాట్స్‌మెన్‌లు ఉండగా వికెట్ కీపర్స్ గా ఇషాన్ కిషన్, పంత్ వ్యవరించనున్నారు. ఆల్ రౌండర్స్ విభాగంలో హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు. స్పిన్నర్ లుగా అశ్విన్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలు ఎంపిక కాగా పేస్ విభాగంలో బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ.

భారత జట్టు : విరాట్ కోహ్లీ (C), రోహిత్ శర్మ (VC), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా , భువనేశ్వర్ కుమార్, షమీ

స్టాండ్‌బై ప్లేయర్స్ : శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్.