బిగ్ బాస్… మానస్‌ను బాధపెట్టిన రవి..!

88
bb

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 4 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 4వ ఎపిసోడ్ ముగిసే సరికి ఇంటి సభ్యుల మధ్య రచ్చతో ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఎవరూ తగ్గడం లేదు. దీంతో మొదటి రోజు నుండే హౌస్‌లో గొడవలు మొదలయ్యాయి. యానీ మాస్టర్, జెస్సీ మధ్య జరిగిన పెద్దదిగా మారడం, యానీ మాస్టర్ కంటతడి పెట్టడం,జెస్సీ యానీ మాస్టర్ కాళ్లు పట్టుకోవడం వరకు వెళ్లింది.

ఇక తాజాగా యాంకర్ రవి – మానస్ మధ్య మరో గొడవ జరిగింది. లోబోకు.. ఇతర కంటెస్టెంట్లులా ఇమిటేట్ చేయమని యజమాని అయిన షణ్ముక్ టాస్క్ ఇచ్చాడు. అయితే లోబో అందరిని ఇమిటేట్ చేస్తూ చక్కగా నటించగా శ్రీరామ చంద్ర, మానస్‌లు అక్కడే అటు ఇటూ తిరుగుతూ సైట్ కొడుతున్నట్టుగా చూపించేశారు రవి, విశ్వ. దీంతో రవి తనలా ఇమిటేట్ చేయడంతో హర్ట్ అయ్యాడు మానస్. ప్రతీ సారి ఆ విషయాన్ని అంత లాగాల్సిన పని లేదు. ఇదేమీ ఆయన హోస్ట్ చేస్తోన్న షో కాదు.. ఈవెంట్ కాదు.. బిగ్ బాస్ ఐదో సీజన్‌కు హోస్ట్ కాదు.. అంతగా ఆ విషయాన్ని లాగాల్సిన అవసరం లేదని మానస్ తన మనసులోని బాధను బయటపెట్టేశాడు. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.