సర్కార్‌ సెట్స్‌లో కాంగ్రెస్ ఎంపీ..!

31
shashi

సర్కార్ వారి పాట సెట్స్‌లో సందడి చేశారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. హైదరాబాద్‌కు విచ్చేసిన శశి థరూర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా లోకేషన్‌కి వచ్చి అందరికి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా “సర్కారు వారి పాట” బృందం, మహేష్ బాబు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేష్‌పై ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు జల్లు కురిపించారు శశి థరూర్. ఆయనను హైదరాబాద్ లో అంతా సూపర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది. హైదరాబాద్‌లోని మా ట్రైటెల్‌హైడ్‌లోని హోటల్‌లో నేను నా సహోద్యోగి గల్లా జయదేవ్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశాను. ఎంత మనోహరమైన వ్యక్తిత్వం! అని ఆయన ట్వీట్ చేశారు.

శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం నుంచి ఎంపీగా ఉన్నారు. జయదేవ్ పార్లమెంటులో గుంటూరు లోక్ సభ సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.