దేశంలో కొత్త‌గా 1,79,723 క‌రోనా కేసులు..

55

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఈనేపథ్యంలో ఇండియాలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. కొత్త‌గా 1,79,723 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 146 మంది ప్రాణాలు కోల్ప‌యారు. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరుకుంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య‌ 3,57,07,727కు చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,45,00172కు పెరిగింది. మృతుల సంఖ్య మొత్తం 4,83,936గా ఉంది.

డైలీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి చేరుకుంది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 7,23,619 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 69,15,75,352 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. మొత్తం 151,94,05,951 వ్యాక్సిన్ డోసులు వేశారు.