జక్కనతో ‘హీరో’ ట్రైలర్‌..

22

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయ్యి విడుదలకు సిద్దంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను రాజమౌళి చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం 4 గంటల 5నిమిషాలకు విడుదల చేయించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు.. పాటలు మరియు ఇతర పబ్లిసిటీ స్టఫ్ అంతా చూస్తుంటే హీరో సినిమాతో గల్లా మంచి నటుడిగా నిలదొక్కుకోవడం ఖాయం అన్నట్లుగా అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు శ్రీరామ్ ఆధిత్య దర్శకత్వం వహించగా మహేష్ బాబు సోదరి అయిన పద్మావతి గల్లా గారు నిర్మించారు.