దేశంలో కొత్తగా 42,766 క‌రోనా కేసులు న‌మోదు..

172

దేశంలో కొత్తగా 42,766 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,88,673కి చేరింది. అలాగే, గత 24 గంటల్లో 38,091మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 308 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,533కి పెరిగింది. రిక‌వ‌రీ రేటు 97.42 శాతంగా ఉంది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,21,38,092 మంది కోలుకున్నారు. 4,10,048 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 68,46,69,521 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క రోజే 71,61,760 డోసులు వేశారు. మరో 4.37 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచామని తెలిపింది.