దేశంలో కొత్త‌గా 18,346 క‌రోనా కేసులు న‌మోదు..

106
corona

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 18,346 కేసులు నమోదయ్యాయి. గ‌డిచిన 209 రోజుల్లో ఇదే అత్య‌ల్పం..ఇక గత 24 గంటల్లో 263 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ఈ మరణాల్లో సగానికి పైగా కేరళలో నమోదయ్యాయి. కేరళలో కొత్తగా 8,850 కేసులు నమోదు కాగా… 149 మంది మరణించారు.

ఇక వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 29,639గా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది. క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 4,49,260గా ఉంది. మ‌రో వైపు వ్యాక్సినేష‌న్ కూడా వేగంగా సాగుతోంది. గ‌త 24 గంట‌ల్లో 72,51,419 మందికి కోవిడ్ టీకాలు వేశారు. దేశ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న‌వారి సంఖ్య 91.54 కోట్లుగా ఉంది.