దేశంలో కొత్త‌గా 7,774 క‌రోనా కేసులు..

92
Covid Cases

దేశంలో కొత్త‌గా 7,774 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది. ఇందులో 3,41,22,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,281 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే, నిన్న 306 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి మ‌రో 8,464 మంది కోలుకున్నారు. దేశంలో క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం 4,75,434కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 132,93,84,230 వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు.