షాక్.. కరోనా కేసులు భారీగా పెరిగే ఛాన్స్‌..!

26
- Advertisement -

కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుండగా ఇక జనవరి తొలివారంలో కేసుల సంఖ్య రెట్టింపయ్యే ఛాన్స్‌ ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.క్రిస్మస్‌, న్యూయర్‌ వేడుకలు పూరయ్యాక రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ కారణంగా జనవరి మొదటి వారంలో కేసులు భారీగా పెరిగితే.. మరో మూడువారాలు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఎంతకాలం స్థిరంగా ఉంటుందో అంచనా వేయడం సాధ్యం కాదని అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఏడు రాష్ట్రాల్లో కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్‌లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందన్నారు. గోవాలో 34 మంది, కర్నాటకలో 8 మంది, కేరళలో ఆరుగురు, మహారాష్ట్రలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఐదుగురు, తమిళనాడులో నలుగురికి, తెలంగాణలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది.

Also Read:గొడవల్లేవ్.. స్నేహితులమే!

- Advertisement -